Governments vs Governors..Telangana to Kerala
mictv telugu

ఈ గవర్నర్లకు ఏమైంది?

November 9, 2022

Governments vs Governors..Telangana to Kerala

గవర్నర్లకు ఏమైంది.?ప్రభుత్వాలతో ఎందుకీ గొడవలు?పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా? గవర్నర్లపై ప్రభుత్వాలు ఎందుకు విరుచపడుతున్నాయి? తెలంగాణ నుంచి కేరళ దాకా ఏం జరగుతోంది.? అసలు గవర్నర్ల అధికారం ఏంటి?వారి లిమిట్స్ ఎందాకా?తమిళనాడు గవర్నర్ రవిని తప్పించాలని సీఎం స్టాలిన్ రాష్ట్రపతికి లేఖ రాస్తే.. గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ పై కోపంతో కేరళ ప్రభుత్వ ఆర్డినెన్స్ నే తీసుకొచ్చింది. తెలంగాణ,తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హీట్‌కు కారణాలేంటి?

రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్

తెలంగాణలో రెండేళ్లుగా రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతిభవన్ మధ్య వార్ నడుస్తోంది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై పర్యటనలో ప్రోటో కాల్ పాటించడం లేదు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు కలెక్టర్ , ఎస్పీలెవరూ స్వాగతం పలకలేదు. గవర్నర్ ఏ కార్యక్రమానికి వెళ్లినా ఇంతే.ప్రభుత్వ నిర్ణయాల్లో గవర్నర్ జోక్యం ఏంటని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. రెండేళ్లుగా గవర్నర్ తమిళిసై ని కలవడానికి సీఎం కేసీఆర్ ఇష్టపడలేదు. ఆ మధ్య రాజ్ భవన్‌కు అలా ఇలా వెళ్లి వచ్చేశారు. అంతకు ముందు గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ని తరచుగా కలిసేవారు. తమిళిసై గవర్నర్‌గా వచ్చిన మొదట్లో బాగానే కలిసాశారు. తర్వాత ఎందుకో రాజ్‌భవన్‌కు వెళ్లాలంటేనే కేసీఆర్ ఇష్టపడటం లేదు. బీజేపీతో లడాయి ఓ కారణం కావొచ్చు.కానీ క్రమంగా దూరం పెరిగింది. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం పై టీఆర్ఎస్ పలుమార్లు ప్రశ్నించింది. కేంద్రం చెప్పినట్టే ఆమె వింటున్నారని ఆరోపించింది.

ఆగిన బిల్లులు

ఇప్పుడు ఏడు బిల్లులు రాజ్‌భవన్‌లో ఆగిపోయాయి.ఈ బిల్లుల్లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బిల్లు కూడా ఉంది. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వచ్చి కలవాలని తమిళిసై సూచించారు. కానీ సబితాఇంద్రా రెడ్డి రాజ్ భవన్‌కు వెళ్లలేదు. రాజ్ భవన్ నుంచి ఎలాంటి సమాచారం తమకు అందలేదన్నారు. అయినా గవర్నర్ కు బిల్లులు నచ్చకపోతే సూచనలు చేస్తూ మార్పులు చేయాలని వెనక్కి పంపొచ్చు. కానీ బిల్లుల్ని ఆపే అధికారం గవర్నర్ లేదు. మార్పులు, చేర్పులు సూచించటం వరకే పరిధి అని రాజ్యాంగ నిపుణులు మాట.

అటు తమిళనాడులో…

తమిళనాడులో గవర్నర్‌కు స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య హైఓల్టేజ్ వార్ నడిస్తోంది. గవర్నర్ రవిని తప్పించాలని రాష్ట్రపతికి స్టాలిన్ లేఖ రాశారు. గవర్నర్‌గా అనర్హుడు అంటూ లేఖపై డీఎంకే, దాని మిత్రపక్షాలు సంతకం చేశాయి. కొంతకాలంగా తమిళనాడులో గవర్నర్ రవి, ప్రభుత్వానికి మధ్య యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ విధానాల్లో రవి జోక్యం చేసుకుంటున్నారని డీఎంకే ఆరోపిస్తుంది. కేంద్రం చెప్పినంటూ వింటూ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించింది.గవర్నర్ రవిని రీకాల్ చేయాలని సీఎంస్టాలిన్ రాష్ట్రపతిని కోరారు.

కేరళలోనూ ఇంతే

కేరళలో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య రచ్చ రచ్చ నడుస్తోంది. ఎంతో కాలంగా ఇది జరుగుతున్నా…9 యూనవర్సిటీల తొలగింపుతో ఇది మరింత ముదిరింది. వీసీలను గవర్నర్ మహ్మద్ అరిఫ్ ఎలా తొలగిస్తారని పినరయ్ సర్కార్ మండిపడింది. యూనివర్సిటీల ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. నిపుణులను వైస్ చాన్స్ లర్‌గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్ తో వివాదం మరింత ముదిరింది.

ఇక్కడే కాదు…

మహారాష్ట్ర, బెంగాల్ , ఢిల్లీలోనూ గవర్నర్లు కిరికిరి పెడుతున్నారని అప్పట్లో ఆ రాష్ట్రప్రభుత్వాలు ఆరోపించాయి. షిండే సర్కార్ ఏర్పాటులో గవర్నర్ సాయం చేశారని శివసేన ఆరోపించింది. మొన్నటిదాకా బెంగాల్లో గవర్నర్ కు మమతకు మధ్య వార్ ఓ రేంజ్ లో ఉండేది. అక్కడి గవర్నర్ ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో ప్రస్తుతానికి బెంగాల్ శాంతంగా ఉంది. గవర్నర్లు పరుధులు దాటి దాటుతున్నారని విపక్షాలు అంటున్నాయి. గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.