ఉపరాష్ట్రపతిగా రాణించాలంటే మాంసాహారం మానాలి..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉపరాష్ట్రపతిగా రాణించాలంటే మాంసాహారం మానాలి..!

August 21, 2017

వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపదవిని సమర్థంగా నిర్వహించాలంటే మాంసాహారం మానేసి, ఆరోగ్యం కోసం శాఖాహారాన్ని తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ సరదా సంభాషణలో సూచించారు.

వెంకయ్యను రాజ్ భవన్ లో సత్కరించిన అనంతరం గవర్నర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా నరహింహన్ వెంకయ్య ఇబ్బందిని గమనించారు.

‘వెంకయ్యా, నేనూ కలసి శాఖాహారం తినే సమయాల్లో ఆయన ఇబ్బంది పడేవారు. ఈ రోజు కూడా ఇక్కడ శాఖాహారమే వడ్డించారు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకు? హాయిగా మాంసాహారం మానేసి నాలాగా శాఖాహారం తీసుకుంటే సరిపోతుందిగా. ఉన్నత పదవిని చేపట్టిన వెంకయ్య రాజ్యసభను సజావుగా నడుపుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే శాఖాహారమే మేలు’ అని గవర్నర్ అన్నారు. ఈ మాటలకు వెంకయ్య కూడా సరదాగా నవ్వేశారు.