గవర్నర్‌పై చంద్రబాబు సంచలన ఆరోపణలు - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్‌పై చంద్రబాబు సంచలన ఆరోపణలు

April 24, 2018

ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. నరసింహన్ అధికార టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను ఏకం చేస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని చెప్పారు.  రాజ్యంగపదవిలో ఉంటూ ఇలా చేయడం భావ్యమా అని ప్రశ్నించారు.

‘గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదు.. అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పింది. దీనిపై మేం పోరాటం కూడా చేశాం.. గవర్నర్ వ్యవస్థ అనేది ఒక క పద్ధతి ప్రకారం పని చేసుకోసుకుపోవాలి. అంతేగాని పత్రికల్లో వార్తలు వచ్చే స్థాయిలో గవర్నర్ చేయడం మంచి పద్ధతి కాదు..’ అని బు అన్నారు.

నిన్న విజయవాడలో నరసింహన్, చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్రంపై దూకుడు తగ్గించాలని గవర్నర్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎమ్మెల్యే బాలయ్య దూషించడం సరికాదని కూడా ఆయన అన్నట్లు వార్తులు వస్తున్నాయి. ఈరోజు గవర్నర్ ఢిల్లీకి వెళ్లడం, ఏపీ హోదా ఉద్యమంపై నివేదిక ఇచ్చే అవకాశముండడంతో సీఎం భగ్గుమన్నారు.