కొందరు ఎంత పెద్ద పదవుల్లో ఉన్నకూడా సామాన్య ప్రజలు ఎలా ఉంటే అలానే ఉంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇదే తీరులో స్పందించారు. ఆయన తన కాలికి అయిన గాయానికి చికిత్స కోసం బుధవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ఓ సాదారణ పౌరుడిలా మొదట ఓపీ విభాగానికి వెళ్లారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి, స్వల్ప శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు.