గవర్నర్ నరసింహన్ పెద్ద దరిద్రం: హీరో శివాజీ - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్ నరసింహన్ పెద్ద దరిద్రం: హీరో శివాజీ

March 1, 2018

గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి కనుక విమర్శలు రావని అనుకుంటారు. అయితే అది ఎప్పుడో తాతల నాటి కాలం సంగతి. గవర్నర్ పదవులను రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన వారికి అప్పగించేస్తుండడం, వారు కూడా వాటికి వత్తాసు పలికి రుణం తీర్చుకుంటుడడంతో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై టీకాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డం, పైరవీలు చేసుకుంటూ పదవి కాపాడుకుంటున్నావని అనడం తెలసిందే.తాజాగా ఏపీలోనూ ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. నరసింహన్ ఏపీ పట్టిన పెద్ద దరిద్రం అని సినీ హీరో శివాజీ విమర్శించారు. ఆయన బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా ధర్మాన్ని తప్పి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించాడు. గుంటూరులో గురువారం ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సదస్సు నిర్వహించారు. శివాజీ మాట్లాడుతూ.. గవర్నర్ తీరును ఎండగట్టారు. ఏపీ ఎంపీలను కూడా తూర్పారబట్టారు. వారు నంగిమాటలు కట్టిపెట్టి పార్లమెంటు స్తంభింపజేస్తే, హాదా ఉద్యమంలో సగం విజయం సాధించినట్లవుతుందని అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును విమర్శిస్తూ.. అతడు ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టి ఉపరాష్ట్రపతి అయ్యారని, మన రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వెంకయ్య నాయుడికి కోపం వస్తోందని ధ్వజమెత్తారు.