శవదహనాన్నీ నిషేధిస్తారేమో.. - MicTv.in - Telugu News
mictv telugu

శవదహనాన్నీ నిషేధిస్తారేమో..

October 10, 2017

రాజ్యాంగపదవిలో ఉన్నప్పటికీ ఆరెస్సెస్, బీజేపీలకు అనుకూలంగా, ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే త్రిపుర గవర్నర్, బీజేపీ మాజీ నేత తథాగత్ రాయ్ మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘తొలు ఉట్టికొట్టే వేడుకలు, ఇప్పుడు పటాకులు.. రేపు హిందూ దహన సంస్కారాలనూ నిషేధిస్తారేమో.. కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసే అవార్డు వాపసీ ముఠా(బీజేపీ, సంఘ్ వ్యతిరేకులు) రేపు  హిందూ శవదహన సంస్కారాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందని కోర్టులో వ్యాజ్యం వేస్తుందేమోఅని తథాగత్‌ రాయ్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. మరోపక్క.. పటాకుల నిషేధంపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా మండిపడ్డారు. బక్రీద్ మేకల బలిని, మొహరం రక్తపాత ఊరేగింపును, క్రిస్మస్ ట్రీలను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు.