Governor Tamilisai and MLC Kavitha met at the temple
mictv telugu

అనుకోకుండా కలుసుకున్న తమిళిసై, కవిత.. తర్వాత ఏం జరిగిందంటే..

October 1, 2022

Governor Tamilisai and MLC Kavitha met at the temple

గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ అనుకోకుండా ఒకచోట ఎదరురుపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ అమ్మపల్లి (శ్రీ సీతారామచంద్రస్వామ) ఆలయంలో ఇద్దరూ ఒకేసారి పూజలు చేయడానికి వెళ్లి కలుసుకున్నారు.

గవర్నర్ ఆలయంలో పూజలు చేయడానికి రాగా, కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారు. దీంతో మొదటగా కవిత.. బాగున్నారా మేడం అని పలుకరించగా, బాగున్నానని తమిళిసై బదులిచ్చారు. తర్వాత ఇద్దరూ ఒకే సమయంలో ఒకే ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని కవిత కోరగా, పూజ అయిన తర్వాత వస్తానని గవర్నర్ చెప్పారు. కవిత ఆలయం బయటకు వెళ్లి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనగా, గవర్నర్ ఆలయంలోకి వెళ్లి మరోసారి పూజలు చేశారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే ఉద్దేశం లేకనే గవర్నర్ ఆలయంలోకి వెళ్లి మరోసారి పూజలు చేశారని ఆరోపిస్తున్నాయి.