Governor tamilisai Calls Harishrao to RajBhavan
mictv telugu

మొన్న సబిత..ఇప్పుడు హరీష్ రావు

November 18, 2022

రాజ్‌భవన్ , ప్రగతిభవన్ మధ్య వార్ కొనసాగుతోంది. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ తమిళి సై ట్విస్ట్ ఇస్తూనే ఉన్నారు. మొన్న సబితా ఇంద్రారెడ్డిని రాజ్‌భవన్‌కు రమ్మన్న గవర్నర్…ఇప్పుడు హరీష్ రావుని పిలిచారు. మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తన దగ్గరే ఉంచుకున్నారు. బిల్లుల ఆమోదంపై గవర్నర్ ఆచితూచి స్పందిస్తున్నారా? గవర్నర్ సందేహాలకు తెలంగాణ సమాధానం ఇవ్వబోతుందా? బిల్లుల విషయంలో ఎందుకిలా జరుగుతోంది.

బిల్లులపై అసంతృప్తి

తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన కొన్ని బిల్లులపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్న యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లుని వెనక్కి పంపారు. ఇందులో సందేహాలు ఉన్నాయని, రాజ్‌భవన్ వచ్చి మంత్రి సబిత సమాధానం ఇవ్వాలన్నారు. దీనికి స్పందించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్ తమిళసై సందేహాలకు జవాబులు ఇచ్చారు. ఇప్పుడు మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు ఈ బిల్లుపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. మంత్రి హరీష్‌ని రావు రాజ్‌భవన్‌కు రమ్మన్నారు.

బిల్లులో ఏముందంటే…

మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ బిల్లుని ఆమోదించింది. టీచింగ్ స్టాఫ్ తో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల రిటైర్మెంట్ వయస్సును పెంచారు. 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడం జరిగింది. దీనిపై గవర్నర్ తమిళి సై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్ భవన్ నుంచి హరీష్ రావుకు పిలుపు వచ్చింది. ఈ బిల్లుకు సంబంధించి వివరణ గవర్నర్ తమిళి సై కోరనున్నారు.

ఎందుకిలా

మంత్రి హరీష్ రావు రాజ్‌భవన్‌కు వెళ్తారా? గవర్నర్ అభ్యంతరాలపై సమాధానం ఇస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బిల్లు విషయంలోనూ గవర్నర్ డెడ్‌లైన్ విధించారు. రాజ్‌భవన్ నుంచి లేఖ రాలేదని మంత్రి సబిత స్పందించలేదు. దీంతో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ఆతర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ అనుమానాల్ని నివృత్తి చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.