నన్ను కావాలనే దూరం పెడుతున్నారు... తమిళిసై - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను కావాలనే దూరం పెడుతున్నారు… తమిళిసై

April 7, 2022

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గురువారం భేటీ అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడామో బయటికి చెప్పలేనంటూ.. తెలంగాణలో అధికార పార్టీ రాజకీయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘నా విషయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. నేను స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని. వివాదాలకు దూరంగా ఉంటాను. ప్రోటోకాల్ విషయంలో అధికారుల తప్పును నేను చెప్పలేదు. ఎమ్మెల్యే సీతక్క చెప్పింది. మేడారం జాతరకు రోడ్డు మార్గంలో వెళ్లాను. రైలు, రోడ్డు మార్గాల్లో మాత్రమే పరిస్థితి నాకెందుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. రాబోయే భద్రాద్రి ఉత్సవాలకు కూడా అలానే వెళ్తాను. బంగారు తెలంగాణలో ఓ గవర్నర్ ప్రయాణించే పరిస్థితి ఇదీ. ఉగాదికి రాజ్ భవన్‌కు రావాలని ఆహ్వానాలు పంపించా. కావాలనే వాళ్లు రాలేదు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వకపోయినా, రాజ్ భవన్ అనే వ్యవస్థకు గౌరవం ఇవ్వాలి. నన్ను అవమానపరిచినా ఎవ్వరినీ విమర్శించను. కానీ, ఒక మహిళను, గవర్నరును గౌరవించే విధానం మాత్రం ఇది కాద’ని వివరించారు.