Governor Tamilisai Soundararajan visited Triple IT Campus Basara in Nirmal District on Sunday
mictv telugu

అందరికీ ఈ విషయం తెలుసు.. బాసర IIITలో గవర్నర్ తమిళిసై

August 7, 2022

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ని సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వరకు రైల్లో ప్రయాణించిన గవర్నర్‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాసరకు వెళ్లారు. ఉదయం సరస్వతి ఆలయాన్ని సందర్శించిన ఆమె అక్కడి నుంచి నేరుగా ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన గవర్నర్ ట్రిపుల్‌ ఐటీ విద్యా బోధన, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. హాస్టల్ గదులు, మెస్‌ను పరిశీలించారు.

అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ… ప్రోటోకాల్ ఎక్కడా అమలు కావడం లేదన్నారు. తాను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వచ్చానని, ఆహారం విషయంలో విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించానన్నారు. సెక్యూరిటీ సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అధ్యాపకుల భర్తీతో సహా టైమ్ బాండ్ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు.