governor Tamilsai using RajBhavan for political purpose, Cpi Narayana Fire
mictv telugu

రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర అగ్గి రాజేస్తున్నది.. సీపీఐ నారాయణ

June 9, 2022

governor Tamilsai using RajBhavan for political purpose,  Cpi Narayana Fire

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ ల‌క్ష్మ‌ణ‌రేఖ దాటుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీపీఐ లీడర్ నారాయ‌ణ. రాజ్‌భ‌వ‌న్‌ను రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌కు వాడుకుంటూ దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. మ‌హిళా దర్బార్ ఎందు కోసం నిర్వ‌హిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రైనా విన‌తిప‌త్రం ఇస్తే స్వీక‌రించి, ప్ర‌భుత్వానికి పంపొచ్చు. అంతే కానీ రాజ్‌భ‌వ‌న్‌ను రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం స‌రికాద‌న్నారు. రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర అగ్గి రాజేస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్ పాత్ర రాజ‌కీయంగా ఉండ‌టం రాజ్యాంగ స్ఫూర్తికి వ్య‌తిరేకంగా ఉంద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌ల‌పెట్టిన ద‌ర్బార్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు సీపీఐ నారాయ‌ణ తెలిపారు.