ఖాళీగా ఉన్న భారత త్రివిధ దళాధిపతి పదవిని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసింది. లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన అనిల్ చౌహాన్ నూతన సీడీఎస్‌గా ప్రకటించింది. కాగా, తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్ ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అప్పటినుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.
ఈ నేపథ్యంలో కేంద్రం ఆ స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసింది. కాగా, యుద్ధ సమయాల్లో త్రివిధ దళాల మధ్య సమన్వయం చేయడానికి కొత్తగా ఈ పోస్టును సృష్టించారు. గతంలో ఈ పని చేయడానికి ప్రభుత్వాలు భయపడ్డాయి. పొరుగుదేశం పాకిస్తాన్‌లో సైన్యాధిపతులు అక్కడి ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని తమ హస్తగతం చేసుకున్న ఘటనలు జరగడంతో ఇక్కడ అలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే ఉద్దేశంతో వెనకడుగు వేశాయి. త్రివిధ దళాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండకూడదని ఆ నిర్ణయం తీసుకున్నాయి. తర్వాత పాక్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను చూసి ఈ పోస్టును క్రియేట్ చేశారు.