జనానికి వాతలు.. సర్కారు జేబులోకి రూ. 577 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

జనానికి వాతలు.. సర్కారు జేబులోకి రూ. 577 కోట్లు

November 21, 2019

కొత్త మోటారు చట్టం.. ఈ పేరు ఎత్తగానే వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎప్పుడు ఎంత ఫైన్ పడుతుందో అని బయపడిపోతూనే ఉన్నారు. ఈ చట్టం ప్రమాదాల నుంచి రక్షించడం మాట ఏమో కానీ ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం సమకూర్చి పెట్టింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరుకు వివిధ రకాల జరిమానాల రూపంలో మొత్తం 38 లక్షల ట్రాఫిక్‌ చలాన్లు జారీ చేసినట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. ఈ చలానాల ద్వారా మొత్తం రూ.577.5 కోట్ల జరిమానా విధించినట్టు చెప్పారు. 

Challan.

లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ జరిమానాలు విధించినట్టు చెప్పారు.తమిళనాడులో అత్యధికంగా 14,13,996 చలాన్లు జారీ చేయగా..అత్యల్పంగా గోవాలో 58 చలాన్లే జారీ అయ్యాయని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అక్కడి ప్రభుత్వాలు ప్రజల వెసులుబాటుకోసం జరిమానాలు తగ్గించాయని చెప్పారు. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలు పాత జరిమానాలనే కొనసాగిస్తున్నారని అన్నారు.