కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్!

March 22, 2020

jg gghj h

కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు ఇచ్చిన పిలుపుకు ప్రజలు సహకరిస్తోన్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జరీచేశారు. 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా సర్వీసులు పూర్తిగా స్తంభించనున్నాయి. లాక్ డౌన్ అవనున్న 75 జిల్లాలలో తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం 5 జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలోని కృష్ణా, తూర్పు గోదావరి,  నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయని సమాచారం. అలాగే ఢిల్లీలో మొత్తం ఏడు జిల్లాలు లాక్ డౌన్ కానున్నాయి. కర్ణాటక బెంగళూరుతో పాటు నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగనుంది. కేరళలో పది జిల్లాల లాక్ డౌన్ కానున్నాయి. తమిళనాడులో చెన్నైతో పాటు జిల్లాలు లిస్టులో ఉన్నాయి.

 

 

కరోనా ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా యోచిన్నట్టు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రాన్ని షట్ డౌన్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై కేసీఆర్ ఇప్పటికే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశంలో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి.. రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు, ఇతర ముఖ్య అధికారులులో చర్చించిన అనంతరమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాను అదుపు చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో అవకాశం లేదని అధికారులు అందరూ ఒకే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చినట్టు తెలుస్తోంది.