Home > Featured > HYD సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

HYD సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Govt green signal for tunnel route in hyderabad

నగరంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి ఉద్దేశించిన సొరంగం మార్గం ఫీజిబిలిటీ స్టడీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించగా, ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్స్ట్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనులు అప్పగించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అక్కడ నుంచి ఆమోదం లభిస్తే ఫీజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు ఆరు నెలల సమయం పడుతుంది.

తర్వాత డీపీఆర్ రూపొందించేందుకు మూడు నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నివేదికల తర్వాత టన్నెల్ బోరింగ్ మెషీన్ సాయంతో టన్నెల్ పనులు చేస్తామని వెల్లడిస్తున్నారు. తొలుత సొరంగం పది కిలోమీటర్ల మేర నిర్మించాలనుకున్నప్పటికీ దానిని 6.30 కిలోమీటర్లకు తగ్గించారు. ప్రతిపాదనల మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1. రోడ్ నెం. 45 జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వరకు 1.70 కిలోమీటర్లు
2. రోడ్ నెం. 12 నుంచి టన్నెల్ జాయినింగ్ పాయింట్ వరకు 1.10 కిలోమీటర్లు
3. కేబీఆర్ ఎంట్రన్స్ నుంచి ఎన్ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 2 కిలో మీటర్లు
4. మూడు అప్రోచెస్ 0.50 కి.మీటర్ల చొప్పున 1.5 కిలోమీటర్లు.

Updated : 26 Aug 2022 9:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top