బంగారంపై సుంకం పెంచిన ప్రభుత్వం.. రూపాయి క్షీణతే కారణం - MicTv.in - Telugu News
mictv telugu

బంగారంపై సుంకం పెంచిన ప్రభుత్వం.. రూపాయి క్షీణతే కారణం

July 1, 2022

పసిడి కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచేసింది. ప్రస్తుతం 10.75గా ఉన్న సుంకాన్ని 15 శాతానికి పెంచింది. ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకోగా, రూపాయి విలువ క్షీణిస్తుండడంతో ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు బంగారంపై పన్ను 7.5 శాతం ఉండగా, దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల పన్ను అదనంగా ఉండేది. దాంతో పాటు 3 శాతం జీఎస్టీ కలిసుండడంతో బంగారం ధరలు పెరగనున్నాయి. మే నెలలో 107 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా, జూన్‌లో కూడా ఇంచుమించు అదే స్థాయిలో బంగారం దేశంలో దిగుమతయింది. దీంతో రూపాయి మీద ఒత్తిడి తగ్గించేందుకు సుంకం పెంపుకు మొగ్గుచూపినట్టు అధికారులు వివరిస్తున్నారు. కాగా, బంగారాన్ని అత్యధికంగా వినియోగించే మన దేశం.. బంగారం దిగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అటు దేశీయంగా మార్కెట్లను బలోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సుంకాన్ని పూర్తిగా తొలగించాయి.