కేంద్రం కొత్త రూల్స్.. మాల్స్, మందిరాలు ఇవి పాటించాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రం కొత్త రూల్స్.. మాల్స్, మందిరాలు ఇవి పాటించాల్సిందే

June 5, 2020

Govt Issued Guidelines For Malls And Restaurants

దేశంలో అమలు అవుతున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా సడలిస్తోంది. 5వ విడత లాక్‌డౌన్‌లో బాగంగా మినహాయింపులు ఎక్కువగానే ఇచ్చింది. తాజాగా ఈ నెల 8 నుంచి మాల్స్, రెస్టారెంట్లు తెరుచుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూ తాము సూచించిన రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో మరో మూడు రోజుల్లో తెరుచుకోబోయే రెస్టారెంట్లు, ఆలయాలు, ప్రార్థనామందిరాలకు ఈ నిబంధనలు సూచించింది. 

నిబంధనలు ఇవే : 

  1. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా చూడాలి. 
  2. మాస్కులు, గౌజులు తప్పనిసరి.
  3. శానిటైజర్లు, సబ్బులను అందుబాటులో ఉంచాలి.
  4.  ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా వినియోగించాలి
  5. దేవాలయాల్లో విగ్రహాలను భక్తులను తాకకూడదు.
  6. మాల్స్, దేవాలయాలల్లో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు.
  7. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేదం.
  8. రెస్టారెంట్లలో ప్రస్తుతం ఉన్న సీటింగ్ 50 శాతానికి కుదించాలి. 
  9. అక్కడే భోజనం చేసే కంటే ఎక్కువ శాతం తీసుకువెళ్లడాన్నే ప్రోత్సహించాలి.
  10. భజనలు, తీర్థ ప్రసాదాలకు అనుమతి లేదు.