గుడ్ న్యూస్.. టీవీ సీరియల్స్ షూటింగ్‌‌కు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్.. టీవీ సీరియల్స్ షూటింగ్‌‌కు గ్రీన్ సిగ్నల్

May 6, 2020

Govt Permits Indoors TV Serials Shooting

బుల్లితెరపై వచ్చే సీరియల్స్‌కు ఉన్న ఆధరణ అంతా ఇంతా కాదు. ఒక్కో సీరియల్ ఏళ్ల తరబడి నడుస్తుందంటే వాటికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి  పరిస్థితుల్లో అయినా వీటి ప్రసారం ఏనాడు ఆగిపోలేదు. కానీ కరోనా దెబ్బతో షూటింగ్స్ నిలిచిపోవడంతో సీరియల్స్ ప్రసారం కావడం లేదు. కొన్ని అయితే పాత ఎపిసోడ్స్‌ మళ్లీ వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీవీ సీరియల్స్ ప్రేక్షకులకు కర్నాటక ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. షూటింగులకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

టీవీ అసోసియేషన్‌తో సీఎం యడియూరప్ప సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం వెల్లడించారు. అయితే వీటికి కొన్ని నిబంధనలు విధించారు.  బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్‌లకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో పాటు షూటింగ్‌లో 12 మందికి మించి పాల్గొనకుండా చూసుకోవాలని ఆదేశించింది. కాగా కరోనా కారణంగా మార్చి 22 నుంచి టీవీ షోలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన 6 వేల మంది ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కన్నడ టెలివిజన్ సంఘం అధ్యక్షుడు శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.