ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త.. కనీస పింఛన్ 6 వేలు! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త.. కనీస పింఛన్ 6 వేలు!

January 25, 2020

increase EPF pension.

ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఈపీఎఫ్ కనీస పెన్షన్ ఇకపై రూ.6 వేలకు పెరగనుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పొందుపరిచినట్టు తెలుస్తోంది. 

నిజానికి ఈపీఎఫ్ పింఛన్‌ను పెంచాలంటూ ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు వారి డిమాండ్ నెరవేరబోతుంది. దీంతోపాటు గతంలో అమల్లో ఉన్న కమ్యుటేషన్ పద్ధతిని తిరిగి తీసుకురావాలని కూడా కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్‌తోపాటు పెన్షన్‌లోని కొంత మొత్తాన్ని కూడా తీసుకునే వీలుంటుంది. అయితే, అలా తీసుకున్న పక్షంలో నెలవారీ పెన్షన్‌ 15 ఏళ్లపాటు మూడోవంతుకు తగ్గిపోతుంది. ఈ పద్ధతిని అమల్లోకి తీసుకొస్తే 6.5 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.