తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. ఈ మేరు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మండలంలో ఎనిమిది గ్రామాలను చేర్చింది. ప్రస్తుతం జిల్లాలో 241 గ్రామ పంచాయితీలు ఉండగా, 11 మండలాలు ఉన్నాయి. కొత్త మండలం ఏర్పాటైతే వాటి సంఖ్య 12కి చేరుకుంటుంది. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఏర్పాటు చేశారు.