అమ్మకానికి ఎయిర్ ఇండియా.. త్వరలో ప్రైవేటుకు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకానికి ఎయిర్ ఇండియా.. త్వరలో ప్రైవేటుకు

December 13, 2019

Air India

ప్రభుత్వ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలం విమనాయాన సేవలను అందించిన ఎయిర్ ఇండియా ఇక తన సేవలకు గుడ్‌బై చెప్పనుంది. ఆ సంస్థను వదిలించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలోని వందశాతం వాటా విక్రయించనున్నట్టు మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి లోక్‌సభలో ప్రకటించారు. సంస్థ అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఈ సంస్థను అభివృద్ధి చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించామని చెప్పారు. 2018-19 సంవత్సరానికి ఎయిర్‌ ఇండియా రూ. 8,556కోట్లు నష్ట పోయిందన్నారు. అప్పులు సమస్యగా మారడంతో దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటాలు వదులుకోవడమే మేలని భావిస్తున్నట్టు చెప్పారు.  

ఎయిర్ ఇండియా ప్రస్తానం ఇదే : 

1932లో జెఆర్‌డీ టాటా తొలిసారి ఈ ఎయిర్‌లైన్స్ ప్రారంభించారు. తొలినాళ్లలో కరాచీ నుంచి ముంబైకి నడిపారు. కొంత కాలానికి  పబ్లిక్ లిమిటెడ్‌ కంపెనీగా మారింది. అప్పుల కారణంగా దాన్ని ఇండియన్ ఎయిర్‌ లైన్స్‌లో విలీనం చేశారు. తర్వాత ఈ సంస్థ 94 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు నడుపుతోంది. అంతర్జాతీయంగా కూడా వీటికి మంచి ఆధరణ ఉంది. కానీ క్రమేన అప్పులు మాత్రం పెరుగుతూ వచ్చాయి. వీటి నుంచి బయటపడేసేందుకు ఎన్నో చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నా లాభం లేకపోయింది. ఇక చివరకు ఆ సంస్థను వదులుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్టు చెప్పారు.