సర్కార్ బడిల అన్నిమంచిగుంటే...ప్రైవేట్ ఇస్కూళ్లకు ఎందుకు ఉర్కుతరు ? - MicTv.in - Telugu News
mictv telugu

సర్కార్ బడిల అన్నిమంచిగుంటే…ప్రైవేట్ ఇస్కూళ్లకు ఎందుకు ఉర్కుతరు ?

August 10, 2017

ఇయ్యాల్ల రేపు  సర్కార్ బడుల దిక్కు ఎవ్వలన్న జూస్తున్రా ?అట్లిట్ల బతికెటోళ్లు గుడ తమ బిడ్డలకు ఇంగ్లీష్ సద్వులు జెప్పే కార్పోరేట్  ఇస్కూళ్లనే సద్వించాలనుకుంటరు,కొన్ని సర్కార్ బడులల్ల ఉన్న ఉత్తమమైన సౌలతులు గసొంటియ్ మరి,ఒగోతాడ మీదికెల్లి ఏ పెచ్చు ఊశిపోయి మీదవడ్తదో అని బుగులుతోని హెల్మెట్లు వెట్టుకొని పాఠాలు జెప్పాల్సిన పరిస్ధితి.ఇంకోతాడ బెంచీలుంటె కుర్శీలుండయ్,కుర్శీలుంటే బెంచీలుండయ్,అన్ని ఉన్నతాడ సద్వుజెప్పే సారుండడు.ఇంకా కొన్ని కారణాలు గుంటయ్ కొందర్కి,గవర్నమెంట్ ఇస్కూళ్లల్ల సద్వు మంచిగ జెప్పరనీ,సార్లు పోరగాన్లమీద ఎక్కో శ్రద్ద సూపరని,ఇస్కూళ్ల సౌలతులు సక్కగుండయని.ఇట్ల రకరకాల కారణాలుంటయ్.ఇగ పోరగాన్లను ఏ నమ్మకంతోని సర్కార్ బడులకు పంపుతరు శెప్పున్రి.

కనీ సార్లు తల్చుకుంటే  అన్ని సర్కార్ బడుల రూపురేఖలు మారిపోతయనెదాన్కి మహబూబ్ నగర్ జిల్లా చౌటగడ్డ తండా ప్రాథమిక పాఠశాలే నిదర్శనం.ఒకప్పుడు ఒక్కటే రూం సదువుకోనికి  ఏం సౌలతులు గుడ లెవ్వట.కనీ బోగం నరేందర్ అనే  హెడ్ మాస్టర్ ఆ ఇస్కూళ్ల అడుగువెట్టిండు…ఇప్పుడు ఆ స్కూల్ రూపురేఖలే మారిపోయ్నయట. అధికారులతోని మాట్లాడి.. పిల్లలు సద్వుకోనికి మూడు పెద్దగదులు,స్వచ్చ భారత్ కింద బాత్రూంలు..బోగం నరేందర్ ప్రత్యేక శ్రద్ద తీస్కొని ఆ స్కూల్ రూపురేఖలు మొత్తం మార్శిపడేశిండట.పిల్లలకు పాఠాలు చెప్పడంలోనూ..తనదైన శైలిలో వెళుతున్నారు నరేందర్. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరిగానే బొమ్మలతో పిల్లలకు అర్ధమయ్యేటట్టు పాఠాలు చెప్తడట,ఒకప్పుడు ఈగలు దోమలు కాపురం వెట్టిన ఈ ఇస్కూళ్ల  ఇప్పుడు 30 మంది విద్యార్థులు సద్వుకుంటున్రట,ఏ సర్కార్ బడి ,ఎట్లైనా నాజీతం నాకస్తదని పట్టిచ్చుకోకుంట ఉండచ్చు.కానీ రేపటి బావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే తొలిమెట్టు బడే…అని ఆలోశించి ఇస్కూల్ కోసం ఇంత తాపత్రయ వడ్డడంటే నిజంగ నరేందర్ సార్ను తారీఫ్ జెయ్యాల్సిందే.కనీ గీ సారు లెక్కనే అందరు సార్లుగుడ  చొరవ తీస్కొని, సర్కార్ ఇస్కూల్లల్ల అన్ని సౌలతులు జేపిచ్చి పోరగాన్లందరు సర్కార్ బడులల్లకు వచ్చెతట్టు కృషిజేశి, శ్రద్దతోని సద్వుజెప్తే … అప్పులు జేశి మరీ.. వేలు,లక్షల ఫీజులు కట్టి పోరగాన్లను  ప్రైవేట్ ఇస్కూల్లల్లకు  ఎందుకు పంపుతరు శెప్పున్రి.