కరోనా దెబ్బ.. రూ.4.88 లక్షల కోట్లు అప్పు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా దెబ్బ.. రూ.4.88 లక్షల కోట్లు అప్పు

March 31, 2020

Govt to borrow Rs 4.88 lakh cr in first half of FY21: DEA Secretary Atanu Chakraborty

కరోనా దెబ్బతో దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా దేశ ఆర్థిక ఆదాయానికి గండిపడింది. ఓవైపు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం అందుకు అన్నీ చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1తో ఆరంభం కానున్న 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకురానుంది. ఈ విషయమై ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ ముప్పుతో సంభవించే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో కేంద్రం చాలా అప్రమత్తంగా ఉంది’ అని చక్రవర్తి తెలిపారు. 

కాగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లుగా ఉంది. పాత రుణాల చెల్లింపుల గురించి స్థూల రుణాల్లో సైతం ఉంటాయి. ఇక నికర రుణాలు 2020-21కి రూ.5.36 లక్షల కోట్లు ఉంటాయని ఆమె అంచనా వేశారు. 2019-20లో ఇది రూ.4.99 లక్షల కోట్లు అయింది.