ఇక రూ. 100 నాణేలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇక రూ. 100 నాణేలు

September 12, 2017

త్వరలో రూ.100 నాణేలను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీ రామచంద్రన్, ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మిల స్మారకార్థం రూ. 100 నాణేలతోపాటు రూ. 5, రూ. 10 నాణేలను కూడా మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. వంద రూపాయల నాణేల్లో ఒక రకందానిపై ఎంజీర్, మరో రకం దానిపై సుబ్బులక్ష్మిల చిత్రాలు ఉంటాయి.

ఇవి వెనుకవైపు ఉంటాయి. ముందువైపు నాలుగు సింహాల అశోక స్తంభం ఉంటుంది. నాణెం వ్యాసం 44 మిల్లీమీటర్లు. బరువు 35 గ్రాములు.  వెండి, రాగి, నికెల్‌, జింక్‌లతో వీటిని తయారు చేస్తారు. ఇక 23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 కాయిన్‌ బరువు 6 గ్రాములు. రూ. 5 నాణుంపై ఎంజీ రామచంద్రన్‌ బొమ్మ, రూ. 10 నాణెంపై సుబ్బులక్ష్మి బొమ్మలు ఉంటాయి. ఎంజీఆర్ జయంతిని పురస్కరించుకుని కాయిన్స్‌, పోస్టల్‌ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు సర్కారు ఇదివరకు కోరింది. అయితే ప్రస్తుతం ఉన్న రూ. 10 రూపాయల నాణేన్ని కొంతమంది వ్యాపారులు తీసుకోవడం లేదు. ఇప్పుడు వంద నాణేల పరిస్థి కూడా అలాగే వుంటుందేమో చూడాలి..