మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8 లక్షల కుటుంబాలకు డీడీ ఉచిత సెట్-టాప్ బాక్స్‌ను ప్రభుత్వం అందించనుంది. దీని కింద ప్రభుత్వం 2025- 26 వరకు ఏకంగా రూ. 2,539.61 కోట్లు వెచ్చించనుంది. క్యాబినెట్ కమిట్ ఆన్ ఎకనమిక్స్ ఎఫైర్స్ (సీసీఈఏ) తాజాగా W కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాడ్‌కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బిండ్) పథకం ద్వారా వారికి అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశంలో ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ కార్యక్రమాలు మరింత మందికి చేరువకానున్నాయి. దీంతో పాటుగా మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
బిండ్ అనేది ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, డీడీకి చేయాతనందించే పథకం. దీంతో పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ పరిధిని పెంచి, మౌళిక సదుపాయలు కల్పించేందుకు వీలవుతుంది. ఈ పథకం దేశంలోని 80 శాతం మందికి ఆల్ ఇండియా రేడియో సేవలు అందేలా చేస్తోంది. ప్రస్తుతం దూరదర్శన్ 36 టీవీ ఛానళ్లను అందిస్తోంది. ఇందులో 28 రీజినల్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే ఆల్ ఇండియా రేడియో అనేది 500కు పైగా బ్రాడ్‌కాస్టింగ్ సెంటర్లను కలిగి ఉంది. కొత్త స్కీమ్ వల్ల ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్ కవరేజ్‌ను పెరగనుంది. భూభాగంలో చూస్తే 66 శాతం కవరేజ్ (ప్రస్తుతం ఇది 59 శాతంగా ఉంది), జనాభా పరంగా చూస్తే 80 శాతం (ప్రస్తుతం 68 శాతంగా ఉంది) మందికి కవరేజ్ లభిస్తుంది.