57 వేల మంది మళ్లీ ఆర్మీలోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

57 వేల మంది మళ్లీ ఆర్మీలోకి..

August 30, 2017

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం సైన్యాన్ని బలోపేతం చేసే కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 57వేల మంది మాజీ సైనికులను తిరిగి సైన్యంలోకి తీసుకోవాలని బుధవారం జరిగిన  కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. దేశ సైనిక చరిత్రలో ఇది అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్నారు. సాయుధ బలగాలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్ది పటిష్టపరచడానికి మాజీ సైన్యాధికారి డీబీ షెకాట్కర్ కమిటీని ప్రభుత్వం గతంలో నియమించింది. ఈ కమిటీ మొత్తం 99 సిఫార్సులు చేసింది. వీటిలో 65 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.  మాజీ సైనికులను తిరిగి బలగాల్లోకి తీసుకోవాలన్న సూచన అందులో ఒకటి అని అన్నారు.

టూత్ టు టెయిల్ అనే ఆర్మీ పాలసీలో భాగంగా మాజీ జవాన్లను తిరిగి తీసుకోనున్నారు. యుద్ధరంగంలో ముందుడి పోరాడే(నెయిల్) సైనికులకు వీరు అన్ని రకాల సాయం చేస్తారు(టెయిల్). జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పులు, మరోపక్క.. లడఖ్ తోపాటు ఈశాన్య సరిహద్దులో చైనా బలగాల కవ్వింపుల నేపథ్యంలో భారత్ మాజీ ఆయుధాలకు పదులను పెడుతోంది.