2023 వరల్డ్ కప్ ఓటమి తర్వాత టీంఇండియా ప్రక్షాళనపై బీసీసీఐ దృష్టిసారించింది. ఈ క్రమంలోనే మొదటిగా సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. రానున్న రోజుల్లో జట్టులో కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రధానంగా టీ20 క్రికెట్లో యువకులకు అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. వయుసు మళ్లిన సీనియర్లను పక్కపెట్టాలనే ఆలోచనలో ఉంది. 2024 వరల్డ్ కప్ లక్ష్యంగా యువకులతో కూడిన టీ20 జట్టును తయారు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం మూడు ఫార్మెట్లకు కెప్టెన్సీ వహిస్తున్న రోహిత్ శర్మను సైతం పదవి నుంచి తప్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అతడి స్థానంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్కు తాత్కిలిక కెప్టెన్గా వ్యవహరించని హార్దిక్ పాండ్యాను పొట్టి ఫార్మెట్కు శాశ్వత కెప్టెన్గా నియమిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యూచర్ కెప్టెన్స్ పై భారత్ మాజీ ఓపెనర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో భారత్ కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా అంటూ కామెంట్స్ చేశాడు. వీరిద్దరి మధ్యనే త్వరలో పోటీ ఉండొచ్చని చెప్పాడు. అండర్ -19 వరల్డ్ కప్ అందించిన పృథ్వీషాకు దూకుడు ఎక్కువని అతడు గొప్పగా రాణించగలడని గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అదే విధంగా ఒక వరల్డ్ కప్ టోర్నీ అధారంగా రోహిత్ శర్మ ప్రతిభను అంచనా వేయడం సరికాదని సూచించాడు.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్య మొదటి ట్రోఫి అందించి తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. తర్వాత టీం ఇండియాకు కూడా సీనియర్లు లేని సమయంలో సారథ్య బాధ్యతలు వహించి ఫ్యూచర్ కెప్టెన్ రేసులో నిలిచాడు. అయితే ప్రస్తుతం జట్టులోనే స్థానం కోల్పోయిన పృథ్వీ షాను భారత్ భవిష్యత్తు కెప్టెన్గా గంభీర్ చూడటం విశేషం.