మారిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు పెరిగిన బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. చమురు ధరలు తగ్గడం, అమెరికా ఫెడరల్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచే అవకాశాలుండడంతో బంగారం రేటు తగ్గుతోంది. వారం క్రితం పది గ్రాముల బంగారం 55, 100, వెండి కేజీ 72,900 వద్ద ఉండగా, ప్రస్తుతం బంగారం 53,000, వెండి 69,600గా ఉంది. కాగా, వారం వ్యవధిలో బంగారం రూ. 2100, వెండి రూ. 3300 తగ్గింది.