Grand Alliance 2.0: Nitish Kumar to take oath as Bihar CM today
mictv telugu

నేడే బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం

August 10, 2022


బిహార్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు మంగళవారం చకచకా జరిగిపోయాయి. బీజేపీ అగ్రనాయకత్వంపై కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న నీతీశ్‌కుమార్‌ ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి వైదొలగారు. ఆ కూటమి ప్రభుత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌కు తెలిపారు. తర్వాత 164 మంది ఎమ్మెల్యేల జాబితాతో మళ్లీ రాజ్‌భవన్‌కు వచ్చారు. 7 పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సీఎంగా నీతీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేయనున్నారు.

మంగళవారం నీతిశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తనను బలహీనం చేసేందుకు బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. చాలాసార్లు తనను అవమానించిందన్నారు. జేడీయూ ఎంపీలు , ఎమ్మెల్యేల అభీష్టం మేరకే ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. కాగా.. నితీష్‌ ఆరోపణలకు బీజేపీ కౌంటరిచ్చింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం తోనే బీహార్‌లో నితీష్‌ సీఎం అయ్యారని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. కేవలం 43 సీట్లే వచ్చినప్పటికి మోదీ ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించారని అన్నారు.