వచ్చాడయ్యో రేప్ నిందితుడు.. సుస్వాగతం.. పూలు, భజంత్రీలు.. - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చాడయ్యో రేప్ నిందితుడు.. సుస్వాగతం.. పూలు, భజంత్రీలు..

October 18, 2018

కాలం మారిపోతోంది. ఒకప్పుడు తమపై చిన్న అపవాదు వచ్చినా జనం సిగ్గుతో ఇళ్లనుంచి బయటికే వచ్చేవారు కాదు. కాలం చాలా మారిపోతోంది కదా.. అందుకే ఇప్పుడు బోరవిరుచుకుని ఊరేగింపులు చేయించుకుంటున్నారు. చిన్న అపవాదు కాదు.. ఏకంగా దైవసేవ చేస్తున్న సన్యాసినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన క్రైస్తవ మతబోధకుడికి జనం పూలుచల్లి, తోరణాలు కట్టి.. భుజాలపైకి ఎక్కించుకుని ఘన స్వాగతం సుస్వాగతం అని ఆహ్వానించారు.

5656

రోమన్ క్యాథలిక్ బిషప్ ఫ్రాన్సో ములక్కల్‌ కేరళ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతనికి కేరళ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొట్టాయం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. తర్వాత పంబాజ్ లోని జలంధర్‌కు వెళ్లాడు. అతడు అక్కడి డిసోజ్ ఆఫ్ ద మిషినరీస్ ఆఫ్ జెసుస్‌‌లో బిషప్‌. అతని రాకను పురస్కరించుకుని భక్తాదులు ర్యాలీ తీశారు. అతనిపై పూలవర్షం కురించారు. ఆహ్వాన తోరణాలు కట్టారు. అతణ్ని ఎత్తుకుని ఊరేగించారు. బిషప్పు చిర్నవ్వు చిందించారు. విషయం తెలియని వాళ్లు ఎవరో గొప్ప మతబోధకుడు వచ్చాడేమో అనుకున్నారు..

tryty