Grand welcome to nikhat zareen world woman boxing gold medalist Nizamabad
mictv telugu

నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ అదిరిపోయే స్వాగతం..

May 27, 2022

Grand welcome to nikhat zareen world woman boxing gold medalist Nizamabad

అంతర్జాతీయ మల్లయుద్ధ వేదికపై స్వర్ణం కొట్టి దేశ ప్రతిష్టను, తెలంగాణ సత్తాను చాటిన నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ హైదరాబాద్ చేరుకుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన నిఖత్‌కు శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టలో ఘన స్వాగతం లభించింది. ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ నేతలు అక్కడికి చేరుకుని అభినందనలతో ముంచెత్తారు.

రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డిలు నిఖత్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. కేసీఆర్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల ఫలించి, నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక పోటీలో గెలిచిందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాన ప్రభుత్వ సాయంతోనే తాను ఈ విజయం సాధించానని నిఖత్ కూడా చెప్పింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ 52 కిలోల విభాగంలో ఫైనల్‌లో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌పై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. బాక్సింగ్ లో పతకం గెలుచుకున్న ఐదో భారత క్రీడాకారిణిగా నిలిచింది.