తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిధుల బృందాలు దావోస్ పర్యటనకు వెళ్లాయి. ఈ నెల 22 నుంచి 26 వరకు ప్రపంచ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. తమ వద్ద ఉన్న సానుకూలతలను చెప్పి వారిని ఒప్పించి అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడులు సాధించారు. గురువారంతో సదస్సు ముగియడంతో వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ బృందం, కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ బృందం తిరుగు ముఖం పట్టాయి.
కేటీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణకు వివిధ రంగాలలో మొత్తం పెట్టుబడులు రూ. 4200 కోట్లు వచ్చాయని వెల్లడించారు. 45 బిజినెస్ మీటింగులు, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 ప్యానెల్ చర్చల ద్వారా పెట్టుబడులు సాధించినట్టు ఆయన తెలిపారు. ఇక ఏపీ విషయానికి వస్తే గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా పెట్టుబడులు సాధించారు. రికార్డు స్థాయిలో ఏపీకి రూ. 1.25 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేలా కంపెనీలతో ఒప్పందం కుదిరింది.