బ్రహ్మీ తాతయ్యాడోచ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

బ్రహ్మీ తాతయ్యాడోచ్ !

August 16, 2017

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తాతయ్యాడు. ఇదేదో సినిమాలో అనుకునేరు. రియల్ లైఫ్ లో తాతయ్యాడోచ్. తన పెద్ద కుమారుడు గౌతమ్, జ్యోత్స్న దంపతులకు కొడుకు పుట్టాడు. బ్రహ్మీ మనవడు పార్థతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్రహ్మానందంకు సినిమాలు తగ్గుదల అవడంతో ఇంట్లో తనకిక మనవడితో ఫుల్లు టైంపాసింక.

ఇప్పటి వరకు దరిదాపు వేయి సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మీ ఈ మధ్య సినిమాలు చెయ్యటం తగ్గించాడు. పర్సనల్ లైఫ్ కు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తున్నట్టున్నాడు. ‘ పల్లకిలో పెళ్ళికూతురు ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గౌతమ్ తర్వాత ‘ వారెవా ’ ‘ బసంతి ’ సినిమాలు చేసాడు. కానీ ఎందుకో ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్టవలేదు. ప్రస్తుతం ఫణీంద్ర దర్శకత్వంలో ‘ మను ’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాందినీ చౌదరీ హీరోయిన్ గా చేస్తోంది. కొడుకు పాద పుణ్యంతోనైనా గౌతమ్ కు స్ర్కీన్ ప్రెజెన్స్ కలిసి వస్తుండొచ్చు చూడాలి. బ్రహ్మీకి మాత్రం ఇప్పుడు ఇంట్లో బోలెడు కాలక్షేపం. తాతలా మనవడు కూడా భవిష్యత్తులో పెద్ద కమెడియన్ అవుతుండొచ్చునేమో.