చివరి గడియల్లో సిల్లీ కోరిక బయటపెట్టిన అమెరికా పెద్దాయన - MicTv.in - Telugu News
mictv telugu

చివరి గడియల్లో సిల్లీ కోరిక బయటపెట్టిన అమెరికా పెద్దాయన

November 23, 2019

ఎవరైనా చావుకు దగ్గరగా వచ్చినప్పుడు చివరి కోరికను కోరుతూ ఉంటారు. చాలా మంది కుటుంబ సభ్యులతో గడపాలనో.. తమ పిల్లలు, మనవల పెళ్లి చూడాలనో అనుకుంటారు. కానీ అమెరికాలో ఓ వృద్ధుడు మాత్రం ఎవరూ ఊహించని కోరిక కోరాడు. తనకు కొడుకులు, మనవళ్లతో కలిసి మందు తాగాలని ఉందని చెప్పాడు. వెంటనే వారంతా కలిసి హాస్పిటల్ బెడ్‌పైనే గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలను ఆ వృద్ధుడి మనవడు పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. 

Grandfather.

విస్కిన్‌సన్ సిటీలో చావు బతుకుల మధ్య హాస్పిటల్‌లో ఉన్న ఓ వ్యక్తి తన కొడుకులను పిలపించాడు. వారిని తన చివరి కోరికను తీర్చమని అడిగాడు. చివరిసారిగా తన కొడుకులతో కలిసి బీరు తాగాలని ఉంది అని చెప్పాడు. వెంటనే వాళ్లు బీరు బాటిళ్లు తీసుకొచ్చి తండ్రితో కలిసి ఆస్పత్రిలోనే తాగారు. తాత, తన కొడుకులతో కలిసి బీరు తాగుతున్న ఫోటోను మనవడు ఆడమ్ స్కీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చివరి గడియల్లో ఇదేం కోరిక అంటూ పేర్కొంటున్నారు.