మహాతల్లి.. మద్యం కోసం పిల్లోడిని పడేసింది.. (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

మహాతల్లి.. మద్యం కోసం పిల్లోడిని పడేసింది.. (వీడియో) 

October 17, 2020

Grandmother Drops Toddler While Saving A Glass Of Drink, Netizens Say 'it's Just Instinct'

పిల్లల కోసం తల్లి చేసే త్యాగాలు వెలకట్టలేనివి. తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఏ తల్లి అయినా ఎంతటి త్యాగానికైనా సిద్ధ పడుతుంది. తన బిడ్డల మీద ఈగ వాలినా సహించదు. అయితే ఓ మహాతల్లి మాత్రం మద్యం కోసం బిడ్డను కింద పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సోఫాలో కూర్చున్న బామ్మ రెండు గ్లాసుల్లో మద్యం పోసి తాగడానికి రెడీగా ఉంది. ఇంతలో తన మనవడు అక్కడికి వచ్చాడు. వస్తూనే ఆ చిన్నారి గ్లాసును పట్టుకోబోయాడు. ఇంతలో బ్యాలెన్స్ ఔట్ అయి కింద పడిపోయాడు. ఆ సమయంలో ఎవరైనా ముందు బిడ్డను కాపాడాలని చూస్తారు. అయితే ఆ చాదస్తపు బామ్మ మాత్రం బాబును పడితే పడ్డాడు అనుకుంది. బాబు చేతిలోంచి కిందకు జారిపడుతున్న గ్లాసును ఒడుపుగా పట్టుకునే ప్రయత్నం చేసింది. 

ఆ పాటికే గ్లాసులోని సగం మద్యం కింద పడటంతో ఆమె ముఖంలో బాధ కనిపిస్తోంది. అంతేగానీ, కింద పడ్డ మనవడికి ఎక్కడ దెబ్బలు తగిలాయో అని ఆమె కాస్త కూడా ఆలోచించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి కొందరు నెటిజన్లు బామ్మను తిట్టి పోస్తున్నారు. ‘తాగుబోతు బామ్మ.. బుడ్డోడిని కింద పడేసింది’ అంటూ మొట్టికాయలు వేస్తున్నారు. మరికొంద‌రు నెటిజ‌న్లు ఆమె చేసిన ప‌నిని మెచ్చుకుంటున్నారు. ఆమె గ్లాస్ కింద పారేసి ఉంటే అది పగిలి బాబుకి ఇంకా పెద్ద ప్రమాదమే జరిగేదని.. మంచి పని చేసిందని కొనియాడుతున్నారు.