ఆస్తినంతా రాహుల్ గాంధీకి ఇచ్చిన బామ్మ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్తినంతా రాహుల్ గాంధీకి ఇచ్చిన బామ్మ

April 5, 2022

hfght

ఓ వృద్దురాలు కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో ఎంతోకాలంగా కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తినంతా రాసిచ్చిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల బామ్మ పుష్ప మాంజీలాల్‌.. రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులతో పాటు, 10 తులాల బంగారాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ పేరున రాశారు.

అంతేకాకుండా, ఆ వీలునామాను డెహ్రాడూన్ జిల్లా కోర్టులో ఫైల్ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను డెహ్రాడూన్ మెట్రోపాలిటన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లాల్‌చంద్ శర్మకు అందజేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలకు ప్రభావితమై.. తన ఆస్తినంతా ఇచ్చేసినట్లు పుష్ప మాంజీలాల్ తెలిపారు.  ఆస్తి పత్రాలు రాహుల్ గాంధీకి చేరేలా చూడాలని ఆమె కోరారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ గాంధీ కూడా తమ జీవితాలను దేశ సేవకు అంకితం చేశారని కొనియాడారు. దేశ సేవలో తన ఆస్తి కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ పని చేయడానికి పూనుకున్నానని చెప్పారు.

మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీకి రాహుల్ గాంధీ, సోనియా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి, అధికారాన్ని చేపట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.