తాత పాటకి మనవడి స్టెప్పులు.. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాడిలా..
సూపర్ స్టార్ కృష్ణ స్టెప్పులు వేసిన ‘జుంబారె జుజుంబారె’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’ సినిమాలోనిది ఈ పాట. అయితే 26 ఏళ్ల తర్వాత ఈ పాట రీమిక్స్ అయి వచ్చింది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రీమిక్స్ పాట మీద ఆయన మనవడు డాన్స్ చేశాడు. ఆయన మనవడు ఎవరో కాదు.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్. అతను అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హీరోగా పరిచయం అవుతున్నాడు.
పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. 50 శాతం సినిమా చిత్రీకరణ పూర్తి కాగా, కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ నిలిచిపోయింది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ జుంబారే రీమిక్స్ పాట టీజర్ విడుదల చేసి.. కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా, ఈ చిత్రంలో జగపతిబాబు, నరేష్, సత్యా, అర్చనా సౌందర్య నటిస్తున్నారు.