Granted bail to Sri Lankan Cricketer Danushka Gunathilaka
mictv telugu

అత్యాచారం కేసులో క్రికెటర్‌కు బెయిల్..

November 17, 2022

Granted bail to Sri Lankan Cricketer Danushka Gunathilaka

వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి అత్యాచారం కేసులో జైలు పాలైన శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు బెయిల్ లభించింది. 11 రోజులు జైలులో ఉన్న తర్వాత అతడికి సిడ్నీ స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్‌ కోసం అతను కోటి రూపాయలు పూచీకత్తుగా కట్టవలసి వచ్చింది.

గుణతిలకపై ఆస్రేలియాకు చెందిన 29 ఏళ్ల యువతి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్ ద్వారా కలిసిన ఆ యువతిని గుణతిలక బలవంతంగా అత్యాచారం చోయబోయాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో గుణతిలక సిడ్నీ టీమ్ హోటల్ నుంచి వస్తున్నప్పుడు నవంబర్ 6న అర్ధరాత్రి అరెస్టు చేశారు. మొత్తం గుణతిలకపై నాలుగు ఆభియోగాలను పోలీసులు నమోదు చేసారు. సుమారు 11 రోజుల పాటు కటకటాల వెనక ఉన్న గుణతిలకకు తాజాగా సిడ్నీ స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ ఆడిన గుణతిలక తర్వాత గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ అతన్ని సస్పెండ్‌ చేసింది. గతంలోనూ అత్యాచారం కేసులో ఇరుక్కున్న అతను 2018 లో 6 మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొన్నాడు.