క్రిస్మస్ కి ఎవరైనా గ్రీటింగ్ కార్డ్ లు, బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేస్తుంటారు. కానీ ఈ అమ్మాయి కొంత కొత్తగా ఆలోచించిన గ్రాఫిక్ డిజైనర్ అరుదైన బహుమతులను ఇచ్చింది. కొందరు వారికి నచ్చిన బహుమతులు ఇస్తే, మరికొందరు ఎదుటి వాళ్లకు నచ్చినవి ఇవ్వాలనుకుంటారు. కొందరు యూనిక్ గా, కొత్తగా ఏదైనా తయారు చేసి ఎదుటివాళ్లను సంతోష పెట్టాలనుకుంటారు. ఆ కోవకు చెందినదే యూకేకి చెందిన వెరోనికా మెక్ క్వేడ్. ఆమె ఇచ్చిన బహుమతులను చూసి ఆశ్చర్యపోవాల్సిందే! ఆమె @RonMcQuade అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ఫొటోను షేర్ చేసింది.
పిల్లుల మట్టి నమూనాలు, కోడి, గుడ్లగూబ, అరటిపండు.. ఇలా అందమైన వస్తువులను సిరామిక్ ద్వారా తయారు చేసింది. ఇలా మొత్తం మీద సహోద్యుగులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం 25 తయారు చేసింది. తన వేలిపై ఉండే చిన్నగా ఉండే కార్గి చిత్రాన్ని షేర్ చేసింది. తను చేసిన వస్తువులు చాలామందికి నచ్చాయి. ఆమె చేసిన ట్వీట్ కు 1.4 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. నెటిజన్లు వెరోనికాని తన ప్రియమైన వారికోసం చేసిన ఇతర చిత్రాలను కూడా షేర్ చేయమని అడుగుతున్నారు.
కొందరు ‘నాకు చాలా బాగా నచ్చాయి. ఒక నల్ల పిల్లి.. పసుపు కళ్లతో ఉండేదాన్ని నాకు తయారు చేసిస్తారా? నేను దాన్ని కొనుక్కుంటాను. ఎందుకంటే నా అందమైన పిల్లి మూడు వారాల క్రితం చనిపోయింది. దాని గుర్తుగా నేను మీ బొమ్మను ఉంచుకుంటాను’ అంటూ కామెంటారు. ఒక వ్యక్తి సరదాగా ‘నేను మీ ఆఫీసులోనే పని చేస్తున్నా. అందరికీ ఇచ్చినట్టుగా మీరు నాకు బహుమతి ఎందుకు పంపించలేదు. ఏదైనా పంపించండి’ అని కామెంట్ చేశారు. ఇలా సరదాగా, కొన్ని సెంటిమెంట్ గా కామెంట్లు వస్తున్నాయి. తాను సరదాగా చేసిన ఈ బహుమతులకు డిమాండ్ పెరిగినందుకు వెరోనికా చాలా సంతోషంగా ఉంది.