ఘనంగా 2022 ఆస్కార్ వేడుకలు.. విజేతలు వీరే - MicTv.in - Telugu News
mictv telugu

ఘనంగా 2022 ఆస్కార్ వేడుకలు.. విజేతలు వీరే

March 28, 2022

005

చలన చిత్రసీమ పరిశ్రమలో అత్యంత విలువైన అవార్డుగా చెప్పుకునే ఆస్కార్ అవార్డుల 94వ వేడుకలు లాస్ ఏంజెలెస్‌లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి హాలీవుడ్ తారలు తరలి వచ్చారు. కరోనా పరిస్థితులతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ వేడుకలకు రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఉత్తమ నటీనటులుగా విల్ స్మిత్, జెస్సికా ఛస్టెయిన్ ఎంపికయ్యారు. వీరిద్దరూ కూడా గతంలో అకాడెమీ అవార్డులు మిస్ అయిన వారే. గతంలో విల్ స్మిత్ రెండు సార్లు, జెస్సికా ఒక సారి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినప్పటికీ… అవార్డును మాత్రం అందుకోలేకపోయారు. ఈ సారి మాత్రం వీరిద్దరినీ ఆస్కార్ వరించింది.

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అకాడమీ అవార్డుల(ఆస్కార్) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కరోనా పరిస్థితులతో గత రెండేళ్లు అంతగా సందడిలేని ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరిగిన 94వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ‘డ్యూన్ హవా కొనసాగింది. ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో ‘డ్యూన్ బృందం ఆస్కార్ ని ముద్దాడింది.

 

విజేతలు వీళ్లే..

ఉత్తమ చిత్రం: కోడా
ఉత్తమ నటి: జెస్సీకా చానెయిన్( ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయి)
ఉత్తమ నటుడు: విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్
ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కాట్సర్(కోడా)
ఉత్తమ సహాయ నటి: అరియానా డిబోస్( వెస్ట్ సైడ్ స్టోరీ)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: కెన్నెత్ బ్రనాగ్ (బెల్‌ఫాస్ట్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బేవన్ (క్రుయెల్లా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రెగ్ ప్రెజర్ (డ్యూస్)

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: డ్రైవ్ మై కార్ (జపాన్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: సియాన్ హెడర్(కొడా)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: బిల్లీ ఎలిష్ (నో టైమ్ టు డై)
ఉత్తమ సౌండ్: మార్క్ మాంగినీ, థియో గ్రీన్, హెమ్ ఫిల్, రాన్ బార్ట్ లెట్ (డ్యూన్)
ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది క్వీన్ ఆఫ్ బాక్సెట్ బాల్
ఉత్తమ షార్ట్ (యానిమేటెడ్): విండ్ షీల్డ్ వైపర్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్): ది లాంగ్ గుడ్ బై

ఉత్తమ ఒరిజినల్ స్కోర్: డ్యూన్
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: డ్యూన్
ఉత్తమ ప్రొజెక్షన్ డిజైన్: డ్యూన్
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలిష్ ది ఐస్ ఆఫ్ ది టా మీ పై
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్): ది విండి షీల్డ్ వైపర్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: ఇన్ కాంటో