ఈ నాన్న ప్రేమ ఎంత గొప్పదో..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నాన్న ప్రేమ ఎంత గొప్పదో..!

July 5, 2017

కన్నపేగు ప్రేమ అమ్మదైతె కనురెప్ప రక్ష నాన్నది,నాన్న అనే పదం అమ్మ తర్వాతదైనా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఓ అపురూపమైన భావన.అమ్మ వాస్తవం,నాన్న నమ్మకం అంటారు,అలాంటి నాన్న…బిడ్డలపై చూపించే ప్రేమ, భాద్యత ఇన్ఫినిటీ అనే చెప్పాలి.ఇక్కడా ఓ నాన్న ఉన్నాడు..

కూతుర్ని గారాబంగా పెంచే తండ్రుల్ని చూసుంటారు,బిడ్డ ఏది అడిగితే అది కాదనకుండా కొనిపెట్టే తండ్రుల్ని చూసుంటారు,లోకంలో ఉన్న ప్రేమనంతా బిడ్డపై కురిపించే తండ్రుల్ని చూసుంటారు,కానీ ఈ తండ్రి కొంచెం డిఫరెంట్.తన బిడ్డను రాజకుమారిలాగ పెంచాలనుకున్నాడు,తన బిడ్డ దరించే ప్రతీ డ్రెస్ తన స్వహస్తాలతో తయారు చెయ్యాలనుకున్నాడు.

అతని పేరు క్వియాన్ క్జయోఫెంగ్ ఉండేది ప్యారిస్ లో అతను మార్కెటింగ్ బిజినెస్ చేసేవాడు, ఉన్నట్టుండి అతని జీవితంలో ఓ అద్బుతం జరిగింది అదే అతనికి బిడ్డ పుట్టడం,కూతురు పుట్టగాని అతని ఆనందానికి అవదుల్లేవు,తన గారాల పట్టికోసం చేస్తున్న బిజినెస్ లన్నీ మానేసాడు,ఫుల్ టైం ఇంటికే పరిమితమయ్యాడు,ఆ బంగారుతల్లికి రాజకుమారిలాగా పెంచాలనుకున్నాడు,కూతురి మీదున్న ప్రేమతో తను ధరించే ప్రతీ డ్రెస్సు ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాడు,కూతరుకోసం  ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాడు,ఒక్కో డ్రెస్సు కోసం  నెలల టైం వెచ్చించి స్పెషల్ డ్రెస్సులు స్వహస్తాలతో కూతురికోసం కుట్టుతున్నాడు,బిడ్డకోసం ఇప్పటి వరుకు 100 హ్యాండ్ మేయిడ్ డ్రెస్సులు కుట్టాడట,ప్రతీ వారం తన కూతురికి ఒక కొత్త డ్రెస్ తో సప్రైజ్ చేస్తాడట,ఎందుకింత కష్టం అని ఎవరైన అంటే..5 సంవత్సరాల వయసున్న తన కూతురు ఆనందమే నా ఆనందం,నాబిడ్డ చిన్నతనం మొత్తం ఆనందంగా గడవాలి, తను ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చెయ్యాలి…అదే నాక్కూడా ఆనందం అని చెప్తాడట క్వియాన్.అంతేకాదు పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఎలాంటి డ్రెస్సులు వెయ్యాలో అని తల్లిదండ్రులకు ఆన్ లైన్లో సలహాలు కూడా ఇస్తుంటాడట.కూతురి ఆనందంకోసం ఇంత చేస్తున్న ఈ తండ్రి నిజంగా గ్రేట్ కదా. హ్యాట్రాఫ్ టు గ్రేట్ ఫాదర్.