పుట్టిన బిడ్డకు పాలిస్తే తన అందం ఎక్కడ కరిగిపోతుందో అని ఆలోచించి పాలివ్వడం ఆపేశి డబ్బా పాలను పిల్లలకు పడుతున్న ఆధునిక తల్లులున్న ఈరోజుల్లో కూడా ఓ మాతృమూర్తి ఎంతో గొప్పగా ఆలోచించింది. తన బిడ్డ తాగగా మిగిలిన పాలను, తల్లి పాలకు నోచుకోని బిడ్డలకు అందించాలని తాపత్రయ పడింది
.
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం బేవెర్టన్కు చెందిన అండర్సన్ సెయిర్రాకు ఇద్దరు పిల్లలు. తొలిసారి పుట్టిన పాప నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించింది. ఆ సమయానికి ఆమె నుంచి పాల ఉత్పత్తి సరిగా లేకపోవడంతో దాతలపై ఆధారపడాల్సి వచ్చిందట. రెండోసారి పాప పుట్టినపుడు మాత్రం ఆ శిశువుకి పాలు అందించే స్థితిలోనే ఉండటంతో దాతలపై ఆధారపడాల్సిన అవసరం రాలేదు. పైగా ఆమెకు తల్లిపాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో వృధా చేయకూడదని భావించి దానం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 600 గ్యాలన్లను సరఫరా చేసినట్లు ఆమె చెప్పారు. ఇలా చేసేటపుడు అసౌకర్యంగా ఉంటున్నా..ఇలా పాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది చిన్నారులను ఆదుకోవడంతో ఆనందంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. నిజంగా ఈతల్లి మనసు ఎంత గొప్పదో కదా.