Greek Hairdresser Cuts Hair In 47 Seconds, Sets A World Record
mictv telugu

47 సెకన్లలో కటింగ్ చేసి గిన్నిస్ రికార్డ్

September 14, 2022

హెయిర్ కటింగ్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? చేసే మనిషిని బట్టి అరగంట నుంచి 20 నిమిషాలు అనుకోవచ్చు. సెలూన్లలో ఆదివారం మరీ బిజీగా ఉంటుంది కనక కచకచ అని పంద్రా మినట్ మే ఖేల్ ఖతమ్ కావొచ్చు. కానీ ఓ బార్బర్ వీరుడు కేవలం 47 సెకన్లలో హెయిర్ కటింగ్ చేసిపారేశాడు. ఏదో కచకచ అని కత్తిరించడం కాదండోయ్. పక్కాగా కొలతల ప్రకారం, చేయించుకున్న మనిషి ఇదివరకు చేయించుకున్నట్టు చక్కగా చేశాడు. ఈ ఘనకార్యానికి మెచ్చిన గిన్నిస్ సంస్థ అతనికి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ హెయిర్ కటింగ్ రికార్డు కట్టబెట్టింది. గ్రీస్ దేశానికి చెందిన కొస్తాంతినోస్ కూతూపిస్ అనే క్షురకుడు ఈ ఘనత సాధించాడు. 47.17 సెకెన్లలో కట్ చేశాడు. కటింగ్ సరిగ్గా ఉందో లేదోనని జడ్జీలు స్కేలు పెట్టి కొలిచి సంతృప్తి వ్యక్తం చేశారు.