పిల్లిని త‌న్నాడని ప‌దేళ్ల జైలు శిక్ష‌! - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లిని త‌న్నాడని ప‌దేళ్ల జైలు శిక్ష‌!

May 4, 2022

స‌రదా పేరుతో మూగ‌జీవాల ప‌ట్ల పైశాచికంగా వ్య‌వ‌హ‌రించిన ఓ వ్య‌క్తి అందుకు త‌గిన మూల్యం చెల్లించుకున్నాడు. పెంపుడు జంతువుల‌తో అత‌గాడు వేసిన‌ వెకిలి చేష్ట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డం.. అది కాస్తా పోలీసుల వ‌ర‌కూ వెళ్ల‌డంతో అడ్డంగా బుక్క‌య్యాడు. గ్రీస్ దేశంలోని ఎవియా ఐల్యాండ్ వ‌ద్ద జ‌రిగిందీ ఘ‌ట‌న. అక్క‌డ‌ సముద్రాన్ని ఆనుకొని… ఓ ఔట్‌డోర్ డైనింగ్ రెస్టారెంట్‌లో రెండు పిల్లులకు ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించిన వ్య‌క్తి.. అదంతా వీడియో తీశాడు. అలా ఆడిస్తూ చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వికృతంగా న‌వ్వుతూ రెండో పిల్లితో కూడా అలానే వ్యవహరించబోయాడు.

ఈ వీడియో వైర‌ల్ అయి పోలీసులకు ఫిర్యాదు అంద‌డంతో అత‌గాడిని అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నించారు. అయితే … అవి తన పెంపుడు పిల్లులే అని, స‌రదాగా కాలుతో త‌న్నాను కానీ.. వాటికేం కాలేదంటూ వాదించాడు. తనకు జంతువులంటే విపరీతమైన ప్రేమ అని క‌న్నీళ్లు కార్చినా పోలీసులు వ‌దల్లేదు. చివ‌ర‌కు నేరం రుజువు కావ‌డంతో.. ఆ దేశ చట్టాల ప్రకారం.. అతనికి ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డిన‌ట్లు స‌మాచారం.