ఏపీలో 2,588 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో 2,588 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

July 3, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థిని, విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్తను చెప్పింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 2,588 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు, కొత్తగా సృష్టించిన పోస్టులను కూడా భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరి రవిచంద్ర జులై 1న ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల చేసిన మొత్తం పోస్టుల్లో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 446, డెంటల్ సర్జన్ పోస్టులు 30 ఉన్నాయి. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, మిగిలిన పోస్టులను పదోన్నతి, ఒప్పంద విధానం ప్రకారం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రధానంగా పోస్టుమార్టమ్ అసిస్టెంట్ పోస్టులు 348, థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 279, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు 235, స్టాఫ్ నర్స్ పోస్టులు 55, ఫార్మసిస్టు గ్రేడ్ 1 పోస్టులు 74, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 684 , కౌన్సెలర్ పోస్టులు 52లతో ఇతర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సెక్రటరి రవిచంద్ర వివరాలను పేర్కొన్నారు.