Green tea vs Coffee Study reveals which is better for your heart
mictv telugu

గ్రీన్ టీ.. కాఫీ.. గుండెకు ఏది మంచిది?

January 16, 2023

Green tea, coffee, study, heart, health

ప్రపంచంలో నీరు తరువాత అంత ఎక్కువగా తాగే డ్రింక్ టీ లేదా కాఫీ. మన జీవితంలో భాగమైన ఈ డ్రింక్స్ తగ్గించడం, మానేయడం అంటూ జరుగని పని. మరి ఈ రెండింటిలో మన గుండెకు ఏది మంచిదో తెలుసుకోవాలంటే ఇది చదువండి.. టీ లేదా కాఫీ ఈ పాపులర్ డ్రింక్స్ రెండింటిలోనూ కఫెన్ ఉంటుంది. అంతేకాదు.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వెంటనే మనకు ఎనర్జీని అందిస్తాయి. కానీ చాలామంది వీటిని తాగినప్పుడు హైపర్ టెన్షన్, కొన్నిసార్లు హై బీపీ వచ్చే ప్రమాదం ఉంది.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. 220 మిలియన్ల భారతీయులు ఇలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. మనం పాటించే జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పరిస్థితిని ప్రభావితం చేసే అనేక అంశాల్లో ఒకటి. మన రెగ్యులర్ డైట్లో సరైన ఆహారాలు, పానీయాలు చేర్చడం ద్వారా రక్తపోటు, గుండె ఆరోగ్యాన్ని సులభంగా నియంత్రించవచ్చు. రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కాఫీ లేదా గ్రీన్ టీ మంచిదా? లేదా? అని తరుచుగా చర్చించుకుంటారు. ఇటీవలి పరిశోధన ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలను అందించింది.

అధ్యయనం ప్రకారం..
జేఏసీసీ (జపాన్ కోలాబరేటివ్ కోహోర్డ్ స్టడీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాన్సర్ రిస్క్) ఈ పరిశోధనను నిర్వహించింది. ఇది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (జేఏహెచ్ఏ)లో ప్రచురించబడింది. 12ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో 18,000 మందికి పైగా ఉన్నారు. పాల్గొనేవారి కాఫీ, గ్రీన్ టీ వినియోగం వారి రక్తపోటు, హృదయనాళ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తించడం ఈ అధ్యయనం లక్ష్యం. అధ్యయనం ప్రకారం.. కాఫీలో 95 నుంచి 200 మి.గ్రా. కెఫిన్ ఉంటుంది. గ్రీన్ టీ లో 35 మి.గ్రా. మాత్రమే ఉంటుంది. ఫలితంగా ఒక కప్పు గ్రీన్ టీ కంటే కాఫీలో దాదాపు మూడు రెట్లు ఎక్కువ కెఫీన్ ఉంటుంది. కాబట్టి గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు ఉన్నవారికి కాఫీ తీసుకోవడం హానికరమని తేలింది. అందువల్ల మెరుగైన గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ సరైన పానీయం.