Groom Arrives For His Marriage Procession In jcb
mictv telugu

వీడెక్కడి పెళ్లికొడుకురా బాబు.. జేసీబీ డొక్కులో మండపానికి వచ్చాడు…(వీడియో)

February 4, 2023

ప్రస్తుతం పెళ్లిళ్ల స్టైల్ మారిపోయింది. అందరూ తమ వివాహాన్ని వినూత్నంగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పెళ్ళి కార్డుల నుంచి చివరి ఊరేగింపు వరకు అన్ని వెరైటీగా ఉండేలా చూసుకుంటున్నాయి ఈ తరం కొత్త జంటలు. దాని కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు.ఇక వివాహ సమయంలో మండపానికైతే ఎవరీ స్టైల్లో వారు ఎంట్రీ ఇస్తున్నారు. పెద్ద పెద్ద ఓపెన్ టాప్ కార్లు, గుర్రాలు, అందంగా అలకరించిన ప్రత్యేక వాహనాలు వంటి వాటిలో హీరో, హీరోయిన్ టైపులో దిగుతున్నారు. అయితే తాజాగా ఓ పెళ్లి కొడుకు ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచింది

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్‌ పటేల్‌ తన పెళ్ళి కోసం ఓ జేసీబీని సిద్ధం చేశాడు. మీరు విన్నది నిజమే జేసీబీనే సిద్ధం చేశాడు. జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్‌ను అలకరించి దానిలో ప్రయాణించాడు. తన బంధువులతోపాటు వోబాక్స్‌లో అమర్చిన సోఫాపై దర్జాగా కూర్చున్న ఫంక్షన్‌హాల్‌కు వెళ్లాడు. జేసీబీ ఎనుక అతని బంధుగనమంతా ఇతర వాహనాల్లో తరలి వచ్చారు. మధ్యమధ్యలో వాహనాన్ని ఆపి డ్యాన్స్ లు వేస్తూ ఉత్సాహంగా మండపానికి చేరుకున్నారు. జేసీబీపై నుంచి దిగొచ్చి పెళ్లిపీటలపై పెళ్లికూతురికి తాళి కట్టాడు. వివాహం ముగిసిన తర్వాత అదే జేసీబీలో వధూవరులను ఊరేగించడం విశేషం. ఇది చూసిన స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ కాగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. పిచ్చి పీక్స్ కు వెళ్లిందని కొందరు అంటుంటే..వైవిధ్యం ఎక్కువైందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని జంటలు తమ ఊరేగింపు కోసం జేసీబీలను ఉపయోగించుకున్నాయి.