పెళ్లి ఆపి ధర్నాలో పాల్గొన్న వరుడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి ఆపి ధర్నాలో పాల్గొన్న వరుడు..

December 3, 2019

వధువు మెడలో మూడు ముళ్లు వేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన వరుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా పెళ్లి ఆపి నిరసనలో పాల్గొన్నాడు. ఈ ఆసక్తికర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో చోటు చేసుకుంది.

wedding

మహోబాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో గత పది రోజులుగా కొందరు యువకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. డిసెంబర్ 1న రాత్రి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఓ వరుడు.. యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమాలను గమనించి వాటి గురించి ఆసక్తిగా తెలుసుకున్నాడు. మహోబాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నాడు. దీంతో యువకులకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఆ వరుడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.