పెళ్లికొడుకును కాల్చేశారు.. పెళ్లిపందిట్లోనే దారుణం - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికొడుకును కాల్చేశారు.. పెళ్లిపందిట్లోనే దారుణం

February 5, 2020

fg vnb

పెళ్లి ఇంట విషాదం జరిగింది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి కొడుకును కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్‌ రాష్ట్రంలోని దేవ్‌గావ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మసీర్‌పూర్‌ బజార్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. పెళ్లికుమారుడు మండపానికి నడిచి వస్తుండగా.. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు అతడిపై కాల్పులు జరిపారు. వరుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

వరుడి మృతితో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించి వరుడు, వధువు కుటుంబసభ్యులను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హంతకులు వరుడి ఊరేగింపును కొద్ది దూరం నుంచి వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలు లేవని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.