Grooms besties surprise him in sarees
mictv telugu

చికాగో వీధుల్లో చీరల్లో వరుడి ఫ్రెండ్స్ వీడియో!

November 16, 2022

పెండ్లి భారీ ఎత్తున జరుగాలి. పెండ్లికి ముందు ఫొటోషూట్లు చేయాలన్నట్లుగా మారిపోయిందిప్పుడు. ఇక్కడనే కాదు.. ఏ దేశంలో ఉన్నా మన వాళ్ల పద్ధతి ఇలాగే ఉంది. అలా జరిగిన ఒక ఫొటోషూట్ ఇప్పుడు వైరల్గా మారింది. అది ఎందుకో, ఎలాగో చదువండి..

ఏ దేశానికి వెళ్లినా మన పద్ధతులను మరచిపోవడం అనేది చాలా అరుదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్లు పద్ధతులను ఇంకా మరచిపోరు అనేది వాస్తవం. ఒక వరుడు చికాగోలో ఉంటున్నాడు. అక్కడ ఉన్నా మన పద్ధతుల్లోనే పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. పెండ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే పెండ్లికి ముందు పెండ్లి కూతురితో ఒక ఫొటోషూట్ అనుకున్నాడు. ఈ ఫొటోషూట్ని కాస్త ఫన్నీగా మార్చాలనుకున్నారు అతడి ఇద్దరు స్నేహితులు.

పెండ్లి అంటే కోలాహలం ఉండి తీరాల్సిందే! చుట్టాలు, స్నేహితుల ముచ్చట్లు, అలంకరణలతో ముచ్చటగా ఉంటుంది. ఇక వధువు, వరుడు ఒకరికోసం ఒకరి ఎదురుచూపులు కూడా ఇతరులు చూడడానికి రెండు కండ్లు చాలవు. అయితే వరుడిని ఏడిపించడానికి తన స్నేహితులు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. వాళ్లిద్దరూ నీట్గా చీరకట్టి చికాగో వీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అవుతున్నది.
వీడియోలో ఏముందంటే..

ఇద్దరు మగవాళ్లకు ఒకావిడ చీర కడుతూ ఉంటుంది. ఆ చీరల్లో ఇద్దరూ వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్నారు. కట్ చేస్తే.. వరుడు వధువు కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే షాక్. తన ఇద్దరు స్నేహితులూ చీరకట్టులో చూసి అవాక్కయ్యాడు. కాసేపటికి తేరుకొని ఇద్దరినీ గట్టిగా కౌగిలించుకొన్నాడు. ఆ తర్వాత ముగ్గురూ నవ్వుల పువ్వులు పూయించారు. ఈ తతంగం అంతా వధువు చాటుగా చూడడం కొసమెరుపు. ఈ వీడియోని ఇప్పటివరకు 40వేల మంది లైక్ చేశారు. కామెంట్లకు అయితే లెక్కలేదు. ఈ ప్రాంక్ వీడియో పాపులర్ అవ్వడంతో ఆ వధువురూలిద్దరూ తెగ సంతోషపడుతున్నారట. ఒకవేళ ఈ వీడియోని మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. కాసేపు వాళ్లు చేసిన ప్రాంక్కి నవ్వుకోండి.